ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధృవపత్రాల కోసం ఎవరూ ఇబ్బంది పడకూడదనే వాట్సాప్ గవర్నెన్స్ : నారా లోకేశ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 07:17 PM

యువగళం పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం కలిగింది. ఉదయం బస్సు దిగి పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి మళ్లీ తిరిగి బస్సు ఎక్కేవరకు ప్రజలతో, కార్యకర్తలతో, నాయకులతో ఉన్నా. వారి సమస్యలు విన్నా. రైతులు, మహిళలు, విద్యార్థులు, కులవృత్తుల వారిని కలవడం జరిగింది. వారంతా ఒక్కటే అడిగారు.. కుల ధృవీకరణ పత్రం ఇన్నిసార్లు ఎందుకు తీసుకోవాలి అని. ఆదాయ ధృవపత్రం కోసం మళ్లీ అధికారుల వద్దకు ఎందుకు వెళ్లాలని అడిగారు. పవర్ బిల్లు చెల్లించాలంటే ఎందుకు సీమ్ లెస్ గా చెల్లించలేకపోతున్నాం? బస్సు ఎక్కిన తర్వాతే ఎందుకు టికెట్ తీసుకోవాలి? ముందే తీసుకోకూడదా? అని పదేపదే నన్ను అడిగారు. గత ఐదేళ్ల పాలనలో సర్టిఫికెట్లు రానివ్వకుండా చేశారు. దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థికి నాటి ప్రభుత్వం కావాలని సర్టిఫికెట్ ఇవ్వలేదు. వ్యవస్థలో లోపాలను సరిచేయాలని భావించా. ధృవపత్రాల కోసం ఎవరూ ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో మొదలైంది. ప్రతి ఇంట్లో, జేబులో స్మార్ట్ ఫోన్ ఉంది. 60 శాతం మందికి స్మార్ట్ ఫోన్ ఉంది. వారంతా వాట్సాప్ ఇన్ స్టాల్ చేసుకుంటారు. వాట్సాప్ తో వర్క్ చేయాలని యువగళం పాదయాత్ర సమయంలోనే అనుకున్నా. 


 


దీంతో మెటా ఇండియా హెడ్ సంధ్య గారిని కలిసి మాట్లాడడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడా ఇన్ని సేవలు ఒకే ప్లాట్ ఫాం ద్వారా తీసుకురాలేదు. ప్రభుత్వ పరంగా కూడా ఎక్కడా లేదు. మీరు చేయగలుగుతారా? అని అడిగారు. గతేడాది అక్టోబర్ 22న ఢిల్లీలో మెటా సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ రోజు నేను ఛాలెంజ్ ను స్వీకరించాను. డిసెంబర్ నాటికి లాంఛ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎంఓయూ జరిగిన మూడు నెలల 9 రోజుల తర్వాత లాంఛ్ చేస్తున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com