సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లపై కేంద్రమంత్రి కుమారస్వామి ప్రశంసల వర్షం కురిపించారు. ఆంధ్ర డైనమిక్ సీఎం చంద్రబాబు, యంగ్ లీడర్ లోకేష్ అని అభివర్ణించారు. ఎన్నో సార్లు స్టీల్ ప్లాంట్ విషయంపై తనతో వారు చర్చించారని చెప్పారు. ప్లాంట్‌ను ఎలా పరిరక్షించాలనే అంశంపై ఎన్నోసార్లు తనతో మాట్లాడారని కేంద్రమంత్రి కుమారస్వామి గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కలిసి విశాఖ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రయత్నాలు చేశారని గుర్తుచేశారు. చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందరి విజ్ఞప్తి మేరకు ప్యాకేజీకి అంగీకరించారని ని కేంద్రమంత్రి కుమారస్వామి తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ రూ.11,440 కోట్ల తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నడపడంపై అన్ని వర్గాలతో సమావేశమయ్యామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. సమష్టి కృషితో ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అపామని చెప్పారు. కుమారస్వామి పట్టుదలతో ప్యాకేజీను సాధించామన్నారు. ప్యాకేజీని సద్వినియోగం చేసుకొని ప్లాంట్‌ను నడుపుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ వచ్చినపుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సమావేశమై చర్చించారని అన్నారు. కార్మికులకు భరోసా ఇచ్చేందుకు ప్యాకేజీ దోహదం చేస్తుందని మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.