ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరి 14న ముగియనున్న మహా కుంభమేళ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 07:50 PM

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ వేదికగా మహా కుంభమేళ కొనసాగుతోంది. నిత్యం కోట్లాది మంది భక్తులు.. ఈ మహా కుంభమేళలో పాల్గొంటున్నారు. అందుకోసం దేశ విదేశాల నుంచి భక్తులు ఈ కుంభమేళకు తరలి వస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ మహా కుంభమేళ.. ఫిబ్రవరి 14వ తేదీతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీ సైతం ఈ మహా కుంభమేళకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తోంది.తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి.. అంటే మారుమూల ప్రాంతాల నుంచి సైతం ఈ మహా కుంభమేళలో పాల్గొనాలనుకొంటున్న భక్తులకు ఈ మహాదవకాశం కల్పించనుంది. అయితే కుంభమేళకు 40 నుంచి 50 మంది ప్రయాణికులు తప్పని సరిగ్గా ఉండాల్సి ఉంటుంది. అలా వారు.. తమ పరిధిలోని బస్సు డిపోకు చెందిన ఉన్నతాధికారులను సంప్రదిస్తే చాలని అంటున్నారు.ఈ మహా కుంభమేళకు వెళ్లి రావాలంటే.. ఒక్కొక్కరికి రూ. 10 నుంచి రూ. 15 వేల వరకు ఖర్చు అవుతోందంటున్నారు. భోజనాలు, టిఫిన్లు అన్ని ఆర్టీసీ వారే సమకూరుస్తాని చెబుతున్నారు. దీనిపై డిపో ఉన్నతాధికారులతో ముందుగానే సంప్రదిస్తే.. కండిషన్‌లో ఉన్న బస్సులు ఏర్పాటు చేసి.. అదనపు సిబ్బందిని సైతం ఏర్పాటు చేసే అవకాశముంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com