ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 07:54 PM

ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాల నియంత్రణ సాధ్యమని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ కేఆర్‌ రజని అన్నారు. వర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌-7 ఆధ్వర్యంలో బుధవారం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసు యంత్రాంగంతో పాటు ప్రజల చైతన్యవంతమైన భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డి.వనజ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్‌ బి.అడ్డయ్య, రిజిస్ట్రార్‌ పి.సుజాత, ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ రాజశేఖరరావు, ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో టి.భవానీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com