ఓ మైనర్ బాలికకు ప్రేమ పేరుతో వల వేసి ఆపై పెళ్లి పేరుతో మోసగించి వ్యభిచార వృత్తిలోకి దింపి నరకం చూపించారు ఓ తల్లికొడుకు. దీంతో బాలిక ఆచేతన స్థితికి వెళ్లింది. ఈ ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురంలో వెలుగుచూసింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల్లోకి వెళ్ళితే..... స్థానిక ఎన్టీఆర్నగర్కు చెందిన చందు అనే యువకుడు అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ 17 ఏళ్ల మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసగించి ఆపై పెళ్లి పేరుతో వంచించి పెద్దాపురం తీసుకు వచ్చాడు. కొన్నిరోజులు గడిచాక తల్లీ నీలిమ, కొడుకు చందూ డబ్బుపై ఆశతో బాలికకు తమ విశ్వరూపాన్ని చూపించారు. వ్యభిచారం చేయా లంటూ వేధించడం ప్రారంభించి నిత్యం బాలికకు నరకం చూపించారు. బలవంతంగా బాలికతో వ్యభిచారం చేయించారు. దీంతో బాలిక అనారోగ్యం పాలయ్యింది. అలాగే కొన్ని రోజులకు ఆమె శరీరంలో ఇన్ఫెక్షన్ రావడంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీతో చికిత్స చేయించారు. బాలికకు రకరకాల మందులను వాడించి నానాహింసలకు గురి చేశారు. తల్లీ కొడుకులు పెట్టే బాధలు తాళ లేక గతేడాది డిసెంబరు 28న చీమల మందు తాగి బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పరిస్థితి విషమించడంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే బాలికకు చేతులు, కాళ్లు వంకర్లు పోయి కదలేక అచేతనంగా ఉండిపోయింది. కాకినాడ చేరుకున్న బాలిక తల్లి దండ్రులు విశాఖ విమ్స్‌కు తీసుకు వెళ్లి చికిత్స అందించారు. బాలిక మానసిక స్థితి కూడా తేడా రావడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితు లైన తల్లీకొడుకుపై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన నిందితులు పరారీ కావడంతో పోలీసులు ముమ్మంగా గాలించి అరెస్ట్ చేశారు.