మహాశివ రాత్రికి బలివే రామలింగేశ్వరస్వామిని దర్శించుకునే భక్తులకు అసౌకర్యం లేకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. విజయరాయి దగ్గర తమ్మిలేరులో ఏర్పాట్లపై బుధవారం పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... మహాశివరాత్రి పర్వదినాన వేలసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని, తమ్మిలేరులో పుణ్యస్నానాలు ఆచరించి, పితృ దేవతలకు తర్ఫణాలు వదులుతారన్నారు. ఆ సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్నానాల ఘాట్లతో పాటు జల్లు స్నానాలకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పురోహితులకు ఒకపక్క ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉంటాయని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. టీడీపీ నాయ కులు పెదర్ల రాంబాబు, నానీ, దారిబోయిన సత్యనారాయణ తదితరులు ఉన్నారు.