దేశంలోనే మొదటి సారిగా ఏపీలో వాట్సాప్ పాలన చేయనున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఐటీ, విద్యశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం ప్రారంభించారు. తొలిదశలో ప్రజలకు 161 సేవలు అందుబాటులోకి రానున్నాయి. వాట్సాప్ గవర్నెన్స్ సేవల కోసం ప్రభుత్వం మెటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్బంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారి ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ పాలన తీసుకువస్తున్నామని, ప్రపంచంలోనే ఎక్కడా ఇలాంటి సేవలు లేవని అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్‌తో సులభంగా సమస్యల పరిష్కారం చేసుకోవచ్చుని, యువగళం పాదయాత్రలోనే వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన చేసినట్లు మంత్రి లోకేష్ తెలిపారు.