ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టీల్ ప్లాంట్‌ను మళ్లీ నెంబర్ వన్ చేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 08:11 PM

ఉక్కు ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో భారతదేశం ఉందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి  తెలిపారు. ఉక్కు శాఖ మంత్రిగా తాను బాధ్యతలు చేపట్టగానే చాలా సమీక్షలు చేశానని అన్నారు. ఉక్కు ఉత్పత్తిలో మనదేశం అగ్రస్థానంలోకి రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని ఉద్ఘాటించారు. విశాఖపట్నం ఉక్కు సాధన కోసం ఎందరో ప్రాణ త్యాగాలు చేశారని గుర్తుచేశారు. 3 మిలియన్ టన్నుల ఉత్పత్తితో 2014 వరకు విశాఖస్టీల్ ప్లాంట్ బాగా ఉందని తెలిపారు. దేశానికి రూ.45,000 కోట్ల మేర ఆదాయంగా మారిందని.. నవరత్న హోదా కూడా వచ్చిందని తెలిపారు.రూ.11,000 కోట్లతో ఉత్పత్తి పెంచాలని నిర్దేశంతో నష్టాలు వచ్చాయని అన్నారు. లక్ష్యం భారంగా మారిందని... సొంత గనులు లేకపోవడం ఒక కారణమని చెప్పారు. బ్యాంక్‌ల అప్పులు భారంగా మారాయని.. దీంతో పెట్టుబడులు ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఆర్ఐఎన్ఎల్‌కు రూ.35,000 కోట్ల అప్పులు ఇప్పుడు భారంగా ఉన్నాయని తెలిపారు. జూన్‌లో తాను విశాఖపట్నం వచ్చినపుడు ప్రైవేటీకరణ సరికాదని, పునరుద్ధరణ చేయాలని భావించామని చెప్పారు. మూసిన బ్లాస్ట్ ఫర్బేసస్‌లను పునరుద్ధరణ చేస్తామని అన్నారు. ఆర్ఐఎన్ఎల్‌ను సక్సెస్ ఫుల్‌గా నడిపించేందుకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించామని అన్నారు. ప్యాకేజీని సమర్ధంగా వినియోగించేలా రోడ్ మ్యాప్‌పై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌ను మళ్లీ నెంబర్ వన్ చేయడంలో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తామన్నారు. రెండు, మూడు నెలల్లో కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపుతామని చెప్పారు. ఈ వార్షిక ఏడాదికి పూర్తిస్థాయిలో ఉక్కు ఉత్పత్తి సాధన లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. కెప్టివ్ మైనింగ్ అంశాన్ని కూడా పరిశీలిస్తామని అన్నారు. సెయిల్‌లో విలీనం కంటే ముందు విశాఖ ప్లాంట్ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి కుమారస్వామి పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com