జగ్గంపేటలో రూ. 4. 18 కోట్ల అంచనాతో సిమెంట్ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను గురువారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పరిశీలించారు. పంచాయతీరాజ్ డీఈ ఉమా శంకర్ ను అడిగి పనులు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. పనులు నాణ్యతగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.