ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు, వివి ప్యాట్ లకు పటిష్ఠ భద్రత చేకూర్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు ముఖ్య కార్యనిర్వాహక అధికారి తాతబ్బాయి అన్నారు. గురువారం ముమ్మిడివరంలోని ఎయిమ్స్ కళాశాలలో మూడో అంతస్తులో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాములను ఆయన తనిఖీలు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి బి. ఎల్. ఎన్ రాజకుమారితో కలిసి ఆయన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రక్షణ గూర్చి అధికారులతో చర్చించారు.