ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణస్వామి జయంతిని పురస్కరించుకుని రథసప్తమి వేడుకలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం నుంచి మూడురోజుల పాటు వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం తెల్లవారుజామునుంచే క్యూ లైన్లలో నిలుచున్నారు. రధసప్తమి ఉత్సవాల్లో భాగంగా మూడు రోజులపాటు శ్రీకాకుళంలో హెలికాఫ్టర్ టూరిజం ఏర్పాటు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. రధసప్తమి ఉత్సవాలకు శ్రీకాకుళం సర్వాగసుందరంగా ముస్తాబైంది.