ప్రజాసంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. పెద్దారవీడు మండలంలోని శివరాంపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపణీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం గ్రామం లో రూ.10 లక్షలతో నూతనంగా నిర్మించిన సిమెంటు రోడ్డును ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ మెట్టు లక్ష్మీదేవి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగసభలో ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ పార్టీలకతీతంగా అర్హులందరికీ కూటమి ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవరాజుగట్టు పంచాయతీలో రూ.30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మిస్తు న్నట్లు తెలిపారు.
రానున్న రోజులో పంచాయతీ పరిధిలోని అన్ని మట్టి రోడ్లలో సీసీ రోడ్లుగా అభివృద్ధి చేస్తాన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో సూపర్ సిక్స్ పథకాల అమలు కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇళ్లు లేని పేదలు ధరఖాస్తు చేసుకున్న వెంటనే మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. పాఠశాల ఆవరణలోని గుంతలను పూడ్చివేసి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జాన్‌సుందరం, ఎంఆర్ఐ గోపీ, టీడీపీ మండలా ధ్యక్షుడు మెట్టు శ్రీనివాసులరెడ్డి, మాజీ అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రగుంట్ల నాగేశ్వరరావు, టీడీపీ యువనాయకులు ఆనెకాళ్ల శ్రీనివాసులరెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు జడ్డా రవి, టీడీపీ నాయకులు సుబ్బరామిరెడ్డి, గుమ్మా గంగరాజు, ఇండా రామకృష్ణారెడ్డి, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.