విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడికి ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు అపురూప బహుమతిని అందించారు. దాదాపు 20 ఏళ్ల క్రితం పలువురు యువకులు తనకు గిఫ్ట్ గా ఇచ్చిన సైకిల్ ను అప్పలనాయుడికి బహూకరించారు. పార్లమెంటు సమావేశాలకు అప్పలనాయుడు సైకిల్ పై వెళ్తుంటారనే విషయం తెలిసిందే. పార్టీపై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పేందుకు ఆయన పసుపు రంగు సైకిల్ పై వెళ్తుంటారు. మరోవైపు అప్పలనాయుడికి అందించిన సైకిల్ పైనే అప్పట్లో మన్యంతో పాటు చీపురుపల్లి ప్రాంతాల్లో అశోక్ గజపతిరాజు యాత్ర చేశారు. ప్రతి ఏటా దసరా రోజున ఈ సైకిల్ ను అశోక్ గజపతిరాజు తప్పనిసరిగా తొక్కేవారు. తనకు ఎంతో ఇష్టమైన ఆ సైకిల్ ను ఇప్పుడు అప్పలనాయుడికి బహూకరించారు.
![]() |
![]() |