by Suryaa Desk | Sat, Jan 18, 2025, 05:25 PM
ప్రముఖ మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో షాహిద్ కపూర్ 'దేవా' అనే యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రం 31 జనవరి 2025న గ్రాండ్ రిలీజ్‌కి పోటీపడుతోంది. ఇటీవలే మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ముంబై నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, పావైల్ గులాటి పోలీసుగా నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రం కమీనీ తరహాలోనే ఉంటుంది కానీ ఈసారి షాహిద్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ మరియు రాయ్ కపూర్ ఫిల్మ్స్ నిర్మించాయి. ఇది రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన 2013 మలయాళ చిత్రం ముంబై పోలీస్ యొక్క అధికారిక రీమేక్. యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సినిమా టీజర్ కి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం జీ స్టూడియోస్ మరియు రాయ్ కపూర్ ఫిలింస్‌పై నిర్మించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే, పావైల్ గులాటి, ప్రవేశ్ రానా మరియు కుబ్రా సాయిత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ దేవాకు బాబీ-సంజయ్, హుస్సేన్ దలాల్, అబ్బాస్ దలాల్, అర్షద్ సయ్యద్ మరియు సుమిత్ అరోరా కథను అందించారు. విశాల్ మిశ్రా సంగీత దర్శకుడు కాగా, జేక్స్ బిజోయ్ బీజీఎం చేశాడు. అమిత్ రాయ్ సినిమాటోగ్రఫీని అందించగా, ఎ శ్రీకర్ ప్రసాద్ మరియు సందీప్ శరద్ రావడే ఎడిటింగ్ నిర్వహించారు.
Latest News