|
|
by Suryaa Desk | Thu, Dec 19, 2024, 02:23 PM
తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.ఇవాళ అసెంబ్లీ లో ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి తరువాత రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా రేషన్ బియ్యాన్ని ఎవరైనా అక్రమంగా తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కొత్త రేషన్ డీలర్ షాపులను ఇచ్చేందుకు ప్రభుత్వం సద్ధంగా ఉందని.. ఒక కొత్త షాపులు వస్తే ప్రస్తుతం ఉన్న పాత డీలర్ షాపులపై ప్రభావం పడుతుందని తెలిపారు. బీఆర్‌ఎస్ (BRS) ప్రభుత్వ హాయాంలో కొత్తగా 4 వేలకు పైగా తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు అయ్యాయని వివరించారు. ఈ క్రమంలో అన్ని చోట్ల కాకుండా అవసరం అయిన చోట కొత్త రేషన్ షాపులను ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.