![]() |
![]() |
by Suryaa Desk | Fri, Dec 20, 2024, 11:57 AM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. అయితే లంచ్ మోషన్ పిటీషన్ ను రిజిస్ట్రీ అనుమతించాలని తెలిపారు.ఫార్ములా ఈ రేస్ కేసులో తనపై నమోదయిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కోరుతూ కేటీఆర్ తరుపున న్యాయవాదులు లంచ్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేశారు.రిజిస్ట్రీ నిర్ణయం తీసుకోవాలని...న్యాయపరంగా తనపై నమోదయిన కేసులను ఎదుర్కొంటానని కేటీఆర్ నిన్న మీడియా సమావేశంలో చెప్పిన నేపథ్యంలో ఈరోజు హైకోర్టును ఆశ్రయించారు. నిన్ననే ఏసీబీ అధికారులు కేటీఆర్ పై ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన అవినీతి ఆరోపణలపై కేటీఆర్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నాన్ బెయిల్ బుల్ సెక్షన్లు పెట్టడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.