by Suryaa Desk | Fri, Dec 20, 2024, 01:51 PM
తెలంగాణ అసెంబ్లీ వద్ద అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనీల్ కుమార్ రజక బీజేపీ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాయల్ శంకర్ కలిసి తెలంగాణలో ఉన్న జనాభా దామాషా ప్రకారం రజకులను ఎస్సీ జాబితాలోకి చేరుస్తామని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపాలని, రజకుల సమస్యలమీద అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అనీల్ కుమార్, తదితరులు ఉన్నారు.