by Suryaa Desk | Fri, Dec 20, 2024, 02:30 PM
పార్లమెంట్లో అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సంగారెడ్డిలోని అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోపాజి అనంత కిషన్ మాట్లాడుతూ కేంద్ర మంత్రివర్గం నుంచి అమిత్ షాని వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.