by Suryaa Desk | Fri, Dec 20, 2024, 09:05 PM
అక్రమ అరెస్టులతో, నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని గ్రామపంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి వీడనాడాలని తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సిఐటియు) మండల అధ్యక్ష కార్యదర్శులు కంచర్ల జానయ్య పాలడుగు చంద్రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు మంగళవారం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు చలో హైదరాబాద్ బయలుదేరిన కార్మికులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ రెండవ రోజు గ్రామపంచాయతీ కార్మికులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కొరకు శాంతియుతంగా ధర్నా చేయడానికి చలో హైదరాబాద్ ఇందిరా పార్కు వెళుతున్న కార్మికులను అక్రమంగా అరెస్టు చేయడం కార్మికుల పట్ల ప్రజా పాలనలో ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని అన్నారు.
గ్రామపంచాయతీని సుందరంగా తీర్చిదిద్ది గ్రామానికి అవార్డులు తీసుకురావడంలో గ్రామపంచాయతీ కార్మికుల కృషి ఎనలేనిదని కొనియాడారు. గత టిఆర్ఎస్ పాలనలో కార్మికులు అనేక పోరాటాలు చేసి 8500 వేతనం సాధించుకున్నారని దానికి తోడు జీవో నెంబర్ 51లో మల్టీపర్పస్ వర్కర్ విధానం అనే ఉరితాడును కూడా తీసుకువచ్చి కార్మికులకు అనుభవం లేని పనులు చేయించడం వలన అనేకమంది ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితి ఉన్నదని దానికి సంబంధించిన జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని అన్నారు అప్పటివరకు జీవో నెంబర్ 60 ప్రకారం మున్సిపాలిటీ తరహా వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాలలో కార్మికులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి గ్రామపంచాయతీ తో సంబంధం లేకుండా నేరుగా వారి వ్యక్తిగత ఖాతాలోనే వేతనాలు వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికుల న్యాయమైన కోరికల సాధనకై డిసెంబర్ 27, 28వ తేదీలలో టోకెన్ సమ్మె నిర్వహించబోతున్నారని అప్పటికీ కూడా కార్మికుల సమస్యల పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ యూనియన్ నాయకులు మైనం మల్లయ్య వెంకన్న చంద్రయ్య యాదయ్య అర్జయ్య పరమేష్ మరియమ్మ నరసింహ రమేష్ బుజ్జమ్మ సైదులు భాస్కర్ సౌందర్య కల్పన వెంకటమ్మ అంజమ్మ సరిత రాజు పీరయ్య తదితరులు పాల్గొన్నారు.