by Suryaa Desk | Sat, Dec 28, 2024, 07:57 PM
నాగార్జున సాగర్ డ్యాం వద్ద సీఆర్పీఎఫ్ (CRPF) బలగాల భద్రతను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఎస్పీఎఫ్ బలగాలకే డ్యాం భద్రత అప్పగించింది. 2023 ఎన్నికల సమయంలో ఏపీ - తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదం తలెత్తింది. తెలుగు రాష్ట్రాల జల వివాదంలో కేంద్రం జోక్యం చేసుకోవడంతో డ్యాం భద్రత సీఆర్పీఎఫ్ చేతిలోకి వెళ్ళింది. తాజాగా డ్యాం భద్రత, భాద్యతను ఎస్పీఎఫ్ బలగాల చేతికి కేంద్రం అప్పజెప్పింది.