![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 13, 2025, 06:09 PM
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్ స్టాప్‌ను రద్దు చేశారు. ఏప్రిల్ 25వ తేదీ నుండి ఇది అమలులోకి వస్తుందని ఇండియన్ రైల్వే అధికారులు ప్రకటించారు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు విశాఖపట్నం-లింగంపల్లి-విశాఖపట్నం మధ్య ప్రతిరోజు నడుస్తుంది. ఈ రైలును దారి మళ్లిస్తున్నారు.చర్లపల్లి - అమ్ముగూడ - సనత్ నగర్ మీదుగా శాశ్వత ప్రాతిపదికన దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఏప్రిల్ 25వ తేదీ నుండి ఈ రైలు సికింద్రాబాద్, బేగంపేట స్టేషన్ల వైపు వెళ్లదని అధికారులు వెల్లడించారు.