![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 13, 2025, 06:10 PM
తెలంగాణలో 'భారత్ సమ్మిట్' పేరిట ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ సమ్మిట్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తదితరులు హాజరయ్యే అవకాశముందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఏప్రిల్‌లో మూడు రోజుల పాటు నిర్మహించే ఈ సమ్మిట్‌కు అరవై దేశాల నుండి ప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. విదేశాంగ శాఖ అనుమతుల కోసం కేంద్ర మంత్రి జైశంకర్‌ను కలవనున్నట్లు చెప్పారు.గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగుతున్న సమయంలో కేసీఆర్ రాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో జరిగే చర్చకు ఆయన హాజరు కావాలని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చాక నిరుద్యోగాన్ని 8.8 శాతం నుండి 6.1 శాతానికి తగ్గించామని ఆయన తెలిపారు. రాష్ట్రానికి రూ. 2.2 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకు వచ్చామని అన్నారు. పన్ను వసూళ్లలో తెలంగాణ ముందంజలో ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.