![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 05:50 PM
హైదరాబాద్ మహానగర విస్తరణపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ సిటీలతో పాటుగా.. కొత్తగా ఫోర్త్ సిటీ (ఫ్యూచర్ సిటీ)ని నిర్మిస్తున్నారు. దాదాపు 30 వేల ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. ఇందులో భాగంగా.. హెచ్ఎండీఏ తరహాలో ఫ్యూచర్సిటీ అభివృద్ధి కోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ(FCDA)ని ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగు రోడ్డు మధ్య మెుత్తం 56 గ్రామాలతో ఈ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నారు.
అయితే ఈ అథారిటీ పరిధిలోకి వచ్చే ప్రాంతాలను పక్కా మాస్టర్ ప్లాన్ ప్రకారం అద్భుతంగా డెవలప్ చేయనున్నారు. ప్రస్తుతం ఎఫ్సీడీఏ పరిధిలోకి 56 గ్రామాలను తీసుకున్నారు. గతంలో ఇందులోని కొన్ని గ్రామాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండగా.. తాజాగా ఎఫ్‌సీడీఏ పరిధిలో కలిపారు. ఔటర్ రింగ్రోడ్ అవతల, శ్రీశైలం నేషనల్ హైవే, నాగార్జున సాగర్ స్టేట్ హైవేల పరిధిలోని పలు గ్రామాలను సైతం దీని పరిధిలోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిధిలోని శంషాబాద్, దాని పరిసర ప్రాంతాలు సైతం ఎఫ్‌సీడీఏ పరిధిలో చేర్చారు.
ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా.. మీర్‌ఖాన్ పేట గ్రామంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ అండ్ ఎడ్యుకేషన్ హబ్ నిర్మిస్తున్నారు. దీంతో పాటుగా.. అథారిటీ పరిధిలోని పలు హబ్లను కలిపి 12 జోన్లుగా విస్తరించే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలోనే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ క్లస్టర్లు, ఎకనామిక్ జోన్ను అభివృద్ధి చేయనున్నారు. అథారిటీ పరిధిలోనే కాంప్రహెన్సివల్ మాస్టర్ప్లాన్తో పాటు అన్ని ప్రాంతాలకు మల్టీ మోడల్ కనెక్టివిటీ, మోడరన్ అర్బన్ ఎమినిటీస్ సైతం కల్పించనున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కొత్తగా రేడియల్ రోడ్లు, మెట్రోరైల్ కనెక్టివిటీని కూడా అవకాశం కల్పించనున్నారు. ఫ్యూచర్ సిటీ మెట్రోపై ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.