|
|
by Suryaa Desk | Mon, Mar 24, 2025, 12:04 PM
స్వాతంత్ర సమరయోధులను అవమానిస్తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానించేలా కేంద్రంలోని బిజెపి సర్కార్ ప్రవర్తిస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కుందన్ బాంక్వెట్ హాల్ లో డిసిసి అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “జై బాపు - జై భీమ్ - జై సంవిధాన్ సమావేశానికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి,స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి,ఫిషరీస్ సొసైటీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్,ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం గార్లతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ అహింస పద్ధతిలో పోరాటం చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి స్వాతంత్రం సిద్ధింప చేసిన మహాత్మా గాంధీ తో పాటు ప్రజల స్వేచ్ఛ సమానత్వం కోసం రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ లను బిజెపి ఆర్ఎస్ఎస్ అవమాన పరుస్తున్నాయని మండిపడ్డారు.
పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అన్నారు. మహనీయుల ఆశయాలను కాపాడడంతోపాటు ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా “జై బాపు - జై భీమ్ - జై సంవిధాన్” అభియాన్ ర్యాలీ నిర్వహిస్తున్నారని తెలిపారు.రాజ్యాంగ విలువలను కాపాడడానికి ప్రజల హక్కులను పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా అన్ని పట్టణాలు గ్రామాలలో సామాజిక న్యాయం, ఐక్యత కల్పించే ప్రధాన ఉద్దేశ్యంతో సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర చేయాలని ఏఐసీసీ నిర్ణయించిందన్నారు, కావున గ్రామ గ్రామాన ఈ పాదయాత్ర చేయాలి అని సమావేశంలో పిలుపునిచ్చారు, ఈ పాదయాత్ర ద్వారా రాజ్యాంగ గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయడంతో పాటు మహనీయులను స్మరించేందుకు వారు చేసిన సేవలను నేటి తరానికి తెలియపరిచే ఉద్దేశంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త బిజెపి పార్టీ చేస్తున్న అరాచక పాలనను రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.