![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 27, 2025, 11:23 AM
తెలంగాణ రాష్ట్రములో పదో తరగతి పరీక్షలు ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయని తెలిసిన విషయమే. ఐతే ఇప్పటికే పలు ప్రాంతాల్లో క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా బుధవారం కామారెడ్డి జిల్లాలో పేపర్ లీకేజీ ఘటన వెలుగులోకి వచ్చింది. జుక్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రశ్నాపత్రంలోని కొన్ని ప్రశ్నలను సిబ్బంది లీక్ చేశారు. పరీక్షకు కొన్ని నిమిషాల ముందు కొన్ని ప్రశ్నలను కాగితంపై రాసి బయటకు పంపారు. ఆ ప్రశ్నలు సోషలో మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ భీమ్, ఇన్విజిలేటర్ దీపికను విధుల నుంచి సస్పెండ్ చేశారు.