![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 06:25 AM
తెలంగాణలో ఏ గ్రామంలోనైనా 100 శాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, తన సిరిసిల్ల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గాలకు వెళదామని సవాల్ విసిరారు.ఈ నియోజకవర్గాల్లో కూడా ఏ గ్రామంలోనైనా పూర్తిగా రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే అక్కడికక్కడే రాజీనామా చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు ఎవరూ సంతోషంగా లేరని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అతి తక్కువ సమయంలో అభివృద్ధి చెందిందని కేటీఆర్ అన్నారు. సంక్షేమంలో మానవీయ కోణాన్ని, అభివృద్ధిలో ప్రణాళికాబద్ధమైన దృక్పథాన్ని కలిపి కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపారని ఆయన పేర్కొన్నారు. 2014 నుంచి 2022 వరకు రాష్ట్రాల ఆదాయాలను పరిశీలిస్తే తెలంగాణ స్వయం సమృద్ధి కలిగిన రాష్ట్రంగా ఎదిగిందని కేటీఆర్ అన్నారు.