![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 12:27 PM
స్వల్పంగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1050 పెరిగి రూ.83,400 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1140 పెరిగి రూ.90,980కి చేరింది. అలాగే వెండి ధర కూడా రూ.3000 పెరిగి కేజీ ధర రూ.1,14,000గా ఉంది.ఈ రోజు వరుసగా రూ. 1050, రూ. 1140 పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 1,050, రూ. 1,140 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 83,400 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,980 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 83,350 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 91,130 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 1050, రూ. 1140 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.