![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 03:09 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఒక హీరోయిన్‌పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) అనే సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, "ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమ్మాయి పేరు కసికాపూర్ అట. మంచి కసికసిగా ఉంది" అంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు హాజరైన వారు పడిపడి నవ్వారు.మల్లారెడ్డి ఇంకా మాట్లాడుతూ, ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న శ్రీహర్ష తమ కాలేజీ విద్యార్థి అని తెలిపారు. శ్రీహర్ష ఇక్కడే చదివి, ఇక్కడే హీరోగా మారి, ఇక్కడే సినిమా ప్రమోషన్ చేస్తున్నాడని, ఇందుకు సంతోషంగా ఉందని అన్నారు. శ్రీహర్ష తమిళ నటుడు విజయ్ కంటే అందంగా ఉన్నాడని చెబుతూ, అందరినీ నవ్వించారు.శ్రీహర్ష తండ్రి తమ కాలేజీకి ప్రిన్సిపల్‌గా ఉన్నారని చెప్పారు. ఆయన సినిమాను నిర్మించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సినిమా ప్రారంభించినప్పటి నుంచి ఎన్నోసార్లు తనను ఆహ్వానించారని, ఆయన కోసం అసెంబ్లీని వదిలేసి వచ్చానని తెలిపారు. ఈ సినిమా బాగా ఆడి, మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అయితే, హీరోయిన్ కసికసిగా ఉందంటూ చేసిన వ్యాఖ్యల పట్ల మల్లారెడ్డిపై నెటిజన్లు మండిపడుతున్నారు.