![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 08:04 PM
కొడంగల్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి చేరుకున్న సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, నారాయణ పేట్ కలెక్టర్ సిక్త పట్నాయక్, ఎస్పీ పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు.అనంతరం శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి 45వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆలయానికి చేరుకోగా ఆలయ వేద పండితులు పూర్ణకుంభంతో బాజా భజంత్రీలతో స్వాగతం పలికారు. 45 వ వార్షిక బ్రాహ్మత్సవం సందర్భంగా స్వామి వారికి శేష వస్త్రాలు సమర్పించారు.అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థప్రసాదాలు స్వీకరించి వేద ఆశీర్వచనము స్వీకరించారు. ఆలయ అర్చకులు తిరుమల తిరుపతి స్వామి వారి శేష వస్త్రాలు ముఖ్య మంత్రికి బహుకరించారు. బ్రమోత్సవాలలో నాలుగో రోజు యాగశాలలో ఉత్సవ మూర్తులను దర్శించుకున్నారు. బ్రాహ్మణులచే ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి, గురునాథ్ రెడ్డి, దేవాదాయ శాఖ కమీషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్ పి నారాయణ రెడ్డి, టెంపుల్ ఈఓ రాజేందర్ రెడ్డి, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు..