![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 08:02 PM
చిన్న జ్వరానికి గురుకుల విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే దుస్థితి రావడం శోచనీయమని, కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాల నిర్వహణ వైఫల్యానికి ఇదో నిదర్శనమని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి నిఖిల్ మరణం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.83 మంది గురుకుల విద్యార్థులు మరణిస్తే కనీస దిద్దుబాటు చర్యలు చేపట్టని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ఈ మరణం మరొక ఉదాహరణ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక గురుకులంలో 400 మంది విద్యార్థులనే సమర్థవంతంగా చూసుకోలేని ప్రభుత్వం, 2,000 మంది ఉండే ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్వహణను ఎలా చేయగలదని ప్రశ్నించారు. గురుకులాల్లో చదువుతున్న దళిత, బహుజన విద్యార్థుల ప్రాణాలను రక్షించే చర్యలు చేపట్టాలని, మరణించిన విద్యార్థి నిఖిల్ కుటుంబానికి రూ. 15 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.