![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 07:57 PM
మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తుందని ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి అన్నారు. శనివారం నారాయణపేట పట్టణంలోని మెట్రో ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షలను విరమింపజేశారు. ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.