![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 08:14 PM
తెలంగాణ రాష్ట్రం లో రాక్షస - రాబందుల పాలన నడుస్తోంది . జైల్లో ఉండాల్సిన వ్యక్తి నేడు హోం మంత్రి-ముఖ్యమంత్రి గా ఉన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో చట్టాన్ని అతిక్రమించి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసు అధికారులకు బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ రేవంత్ గారు ద్వంసం చేస్తున్నారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన సీఎం వాటిని హరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బీ ఆర్ ఎస్ సభ లోపలా బయటా గణాంకాలతో సహా రేవంత్ తీరును ఎండగట్టి ప్రజల పక్షాన నిలబడ్డది.బీ ఆర్ ఎస్ ప్రధాన ప్రతిపక్షం గా ప్రజల గొంతుక గా పోరాడటాన్ని రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు సోషల్ మీడియా లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారిని రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు . మార్చి 15 ,16 తేదీల్లోనే పదిహేను కేసులు పెట్టారు. రీ ట్వీట్ చేసిన వారిపై కూడా కేసులు పెడుతున్నారు. అశ్లీలత మీద పెట్టాల్సిన సెక్షన్ 67 ఐటీ యాక్ట్ ని బీఆరెస్ కార్యకర్తల మీద ప్రయోగించి ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేస్తున్నారు.
కేసీఆర్ హయం లో 2023 లో తెలంగాణ సైబర్ సెక్క్యూరిటీ బ్యూరో ఏర్పడింది.సైబర్ నేరగాళ్ళ నుంచి ప్రజలను, ప్రభుత్వ శాఖలను, కంపెనీలను కాపాడటానికి మంచి ఉద్దేశం తో ఆ బ్యూరో ను పెట్టారు. రేవంత్ హోమ్ మంత్రిగా ఆ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (CSB) ను దుర్వినియోగం చేస్తున్నారు. డిజిటల్ మోసాల నుంచి ప్రజలను రక్షించాల్సిన ఆ బ్యూరో ను రేవంత్ రెడ్డి బీ ఆర్ ఎస్ సోషల్ మీడియా పై ప్రయోగిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కొందరు రేవంత్ రెడ్డి తొత్తులుగా పని చేస్తూ కాపీ పేస్ట్ ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేస్తున్నారు సైబర్ పెట్రోలింగ్ పేరుతో తెలంగాణ భవన్ పైనే ద్రుష్టి కేంద్రీకరించారు. గాంధీ భవన్ ,బీజేపీ కార్యాలయాలు సైబర్ పెట్రోలింగ్ లో ఎందుకు లేవు ?రేవంత్ సైన్యం పేరిట కే టీ ఆర్ పై దారుణమైన పోస్టులు పెడితే, కాంగ్రెస్ బీజేపీ ఎంపీ లు ఎన్ని దారుణమైన పోస్టులు పెడుతున్నా సైబర్ పోలీసులు చర్యలు సుమోటోగా ఎందుకు తీసుకోవడం లేదు ?
మీరంటున్న ఫెయిర్ నెస్ ,పారదర్శకత ఎక్కడుంది ?
గౌతమ్ ,దిలీప్ కొణతం ,క్రిశాంక్ సోషల్ మీడియా పోస్టుల్లో ఎలాంటి అసభ్యత ఉండదు ..అయినా 67 IT Act కింద కేసులు నమోదు చేస్తున్నారు ఒక వైపు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నారు, మరో వైపు రేవంత్ రాజ్యాంగం ఉల్లంఘిస్తున్నా పట్టించుకోవడం లేదు.బాధితుడు,ఇన్వెస్టిగేటర్ ,జడ్జి, జైలర్, జర్నలిస్టు అన్ని పాత్రలు రేవంత్ రెడ్డే పోషిస్తున్నారు.జైల్లో తనను ఘోరంగా చూశారని అసెంబ్లీ లో అన్న రేవంత్ రెడ్డి, అదే జైల్లో తనను బాగా చూసుకున్నారని ఓ ఛానల్ అధినేత కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఇదే రేవంత్ చెప్పారు జైల్లో నాగయ్య అనే సహా ఖైదీ తనకు అన్ని చేసిపెట్టారని కూడా చెప్పారు.మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాగయ్య ను 'వాడు' 'వీడు' కింద కూర్చునే వాడు అంటూ రేవంత్ తన ఫ్యూడల్ మైండ్ సెట్ ను చాటుకున్నారు నిజానికి సైబర్ పెట్రోలింగ్ జరగాల్సింది సెక్రటేరియట్ లో.రేవంత్ అన్న తమ్ముళ్లు చెబితే కానీ సచివాలయం లో ఫైళ్లు కదలడం లేదు ..అక్కడ సైబర్ పెట్రోలింగ్ జరగాలి.ఫైళ్లు క్లియర్ చేయకుండా ఆర్ ఆర్ టాక్స్ యథేచ్ఛగా వసూలు చేస్తున్న HMDA E-Office పోర్టల్ లో సైబర్ పెట్రోలింగ్ జరగాలి దిలీప్ కొణతం ,జర్నలిస్టు రేవతి పై వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టం (111 BNS) కింద కేసులు నమోదు చేస్తున్నారు ?వారంత తప్పు ఏమీ చేశారు?కాంగ్రెస్ బీజేపీ లు కలిసి రాష్ట్రం లో ప్రతి రోజూ వ్యవస్థీకృత నేరాలు చేస్తున్నాయి . ముందు వాటి మీద కేసులు పెట్టాలి.