![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 10:36 AM
ఛత్తీస్‌గఢ్‌లో నిన్న ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణకు చెందిన మహిళా మావోయిస్టు, దివంగత కేంద్రకమిటీ సభ్యుడు శాఖమూరి అప్పారావు భార్య, మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ సభ్యురాలైన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ భాను అలియాస్ చైతే అలియాస్ సరస్వతి అలియాస్ దమయంతి మృతి చెందింది.రేణుకపై తెలంగాణలో రూ. 20 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌లో రూ. 25 లక్షల రివార్డులున్నాయి. బీజాపూర్, దంతెవాడ సరిహద్దులోని ఇకేలీ బెలీనార్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందుకున్న బలగాలు నిన్న కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దాదాపు రెండు గంటలపాటు కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో రేణుక మృతి చెందింది. ఘటనా స్థలం నుంచి ఇన్సాస్ రైఫిల్, పేలుడు పదార్థాలు, ల్యాప్‌టాప్, ఇతర వస్తువులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.