![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 11:26 AM
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఆందోళన నిర్వహించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు మాదాపూర్ డీసీపీ వెల్లడించారు. నిన్న మధ్యాహ్నం మూడున్నర గంటలకు టీజీఐఐసీకి చెందిన 400 ఎకరాల భూమిని చదును చేసేందుకు అధికారులు వచ్చారని, అదే సమయంలో హెచ్‌సీయూకు చెందిన కొందరు ఆందోళనకు దిగారని ఆయన తెలిపారు.జేసీబీని అడ్డుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. పోలీసులపై పలువురు దాడి చేయడంతో మాదాపూర్ ఏసీపీకి గాయాలయ్యాయని అన్నారు. మొత్తం 53 మందిని అదుపులోకి తీసుకున్నామని, ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేసినట్లు చెప్పారు. హెచ్‌సీయూకు సంబంధం లేని ఇద్దరిని అరెస్టు చేశామని తెలిపారు.