|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 08:41 PM
మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి రుద్రారం గ్రామంలో 23వ, 24వ, 25వ మరియు 26వ వార్డుల నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచార కార్యక్రమంలో ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఇంచార్జి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ–ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, పటాన్‌చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారితో కలిసి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ గారు పాల్గొని ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మాద్రి పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమానికి ప్రతీక అయిన కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలి అని ప్రజలను కోరారు.గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అమలైన అనేక సంక్షేమ పథకాలు, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పేదలు, రైతులు, కార్మికులు, మహిళలకు నిజమైన న్యాయం జరుగుతుందని స్పష్టంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గూడెం మధు గారు, గడీల శ్రీకాంత్ గౌడ్ గారు, గడీల కుమార్ గౌడ్ గారు,రామచందర్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, మన్నే రాజు గారు,విజయ్ గారు,కంకర శ్రీను గారు, మెరాజ్ ఖాన్ గారు, రాజ్ కుమార్ గారు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు MPR యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు