|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 10:55 AM
వేములవాడ శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి జాతర సందర్భంగా భక్తులకు సాఫీగా దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు పర్యవేక్షించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో వీఐపీ దర్శన ద్వారం, బారికేడింగ్, క్యూ లైన్లు, తాగునీటి సదుపాయం, ప్రసాదం కౌంటర్, కళ్యాణకట్ట, మొబైల్ టాయిలెట్ల వద్ద ఏర్పాట్లను పరిశీలించి, మరిన్ని తాగునీటి పాయింట్లు ఏర్పాటు చేయాలని, మొబైల్ టాయిలెట్ల సంఖ్య పెంచాలని సూచనలు చేశారు.మహా శివరాత్రి సందర్బంగా స్వామి వారి ఆలయాన్ని పూల అలంకరణతో అందంగా ముస్తాబు చేసి జాతరను వైభవంగా నిర్వహించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. పార్కింగ్ స్థలం వద్ద కోడెల టికెట్ కౌంటర్, పందిర్లు, శివార్చన స్టేజీ పరిశీలించారు. మహా శివరాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు.పరిశీలనలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీఓ రాధాభాయి, ఆలయ ఈఈ రాజేష్, డీఈ రఘునందన్, తహసీల్దార్ జయంత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు.