|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 11:04 AM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతి కుటుంబ అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు.శుక్రవారం జిన్నారం మున్సిపాలిటీ జంగంపేట, జిన్నారం, మంగంపేట్, ఊట్ల, నల్తూర్ గ్రామాల పరిధిలోని వివిధ వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ గారితో కలిసి ప్రచారం నిర్వహించారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మీకు కావాల్సిన అభివృద్ధి సంక్షేమం బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమం, అభివృద్ధి చేయాలనే తలంపుతో ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ప్రతి ఒక్కరికి సంక్షేమానికి కృషి చేస్తుందని కొనియాడారు. మహా లక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు ఉచిత బస్ ప్రయాణం తో పాటు పేదలకు గృహ లక్ష్మీ పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని తెలిపారు.నూతన మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 15 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.ఎన్నికలు పూర్తికాగానే ఈ నిధులతో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, అభ్యర్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు..