|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 11:33 AM
మెడ్చల్–మల్కాజిగిరి జిల్లా, కీసర మండలం, నాగారం రామకృష్ణ నగర్ కాలనీ (HMT లేఔట్)లోని శివాలయానికి చెందిన 1365 గజాలను హైడ్రా కాపాడింది. 2017లో 400 గజాల్లో శివాలయం నిర్మించగా.. మిగిలిన భూమి ఖాళీగా ఉంది. అయితే అక్కడ కొంతమంది స్థానికులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రామకృష్ణానగర్ కాలనీ నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. గుడికి కేటాయించిన భూమి అన్యాక్రాంతం అవ్వకుండా కాపాడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు హైడ్రా క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో విచారించి దేవాలయానికి కేటాయించిన భూమిగా నిర్ధారించుకుంది. 1365 గజాల స్థలం దేవాలయనాకి చెందినదిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది