|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 11:40 AM
అమీన్పూర్ : అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ శ్రీ నందారం నరసింహా గౌడ్ తన అనుచరులతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీలు దేవానందం, యాదగిరి యాదవ్, వెంకట్ రెడ్డి, దశరథ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, లతో పాటు 500 మంది కార్యకర్తలు మాజీ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారి నాయకత్వంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలను బిఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆయన ఆశాభవం వ్యక్తం చేశారు.