|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 12:34 PM
హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భవనం మొదటి అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో దట్టంగా పొగ కమ్ముకోవడంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని, రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకోవడంతో సహాయ చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఘటనపై పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. పోలీసులు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ, ఎవరినీ ల్యాబ్ లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.