|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 12:44 PM
బిఆర్ఎస్ పార్టీ నాయకులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా నిరసిస్తూ, కాంగ్రెస్ పార్టీకి చెందిన వజ్రెష్ యాదవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ ముందు బిఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంబీపూర్ రాజుతో పాటు మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి, మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.బిఆర్ఎస్ నాయకులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ, పార్టీ శ్రేణులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.