|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 02:30 PM
మేడారం సమ్మక్క–సారలమ్మల మహాజాతర ముగిసినా, భక్తుల ఆరాధన హుండీల రూపంలో కొనసాగుతోంది. హనుమకొండలోని టీటీడీ కల్యాణమండపంలో జరుగుతున్న హుండీల లెక్కింపులో భక్తుల నిష్కల్మషమైన నమ్మకాలు, చిత్రవిచిత్రమైన కోరికలు లేఖల రూపంలో బయటపడుతున్నాయి. పెళ్లి కావాలని, భూ వివాదం పరిష్కారం కావాలని, ప్రేమ వివాహానికి పెద్దల అంగీకారం, ఉద్యోగాలు, విదేశీ అవకాశాలు, సీఎం రేవంత్ రెడ్డి తమను రెగ్యులరైజ్ చేయాలని, కొడుకు బారి నుంచి కాపాడాలని కోరుకుంటూ భక్తులు లేఖలు రాశారు. కొందరు నిలువెత్తు బంగారం, కోడి, మేకతో మొక్కులు చెల్లిస్తామని పేర్కొన్నారు.హన్మకొండలోని TTD కళ్యాణ మండపంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ, కఠిన భద్రత మధ్య సుమారు 500 మంది సిబ్బంది పది రోజుల పాటు ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. (TG) ప్రతి లేఖను జాగ్రత్తగా పరిశీలించి, సంబంధిత విధాన ప్రక్రియలకు అనుగుణంగా వర్గీకరించటం జరుగుతోంది.