|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 03:56 PM
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు, నాబార్డు సహకారంతో శనివారం కొత్తగట్టు, ఇప్పలపల్లి గ్రామాల్లో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించింది. బ్రాంచ్ మేనేజర్ పింగిలి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆర్థిక మోసాల నుంచి రక్షణకు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ లావాదేవీలు, సైబర్ భద్రత, డిజిటల్ సేవలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. తక్కువ వడ్డీ రుణాలు, ప్రధాని జీవనజ్యోతి, సురక్ష బీమా పథకాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, కళాజాత బృందం పాల్గొన్నారు.