వ్యవసాయంలో యాంత్రికరణ అవసరమని వ్యవసాయ మంత్రి అచ్చెనాయుడు అన్నారు. గుంటూరు విజ్ఞాన్ యూనివర్శిటీలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి అచ్చెన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. వ్యవసాయంపై కనీస దృష్టి పెట్టలేదన్నారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని.. యాంత్రికరణను ప్రోత్సాహిస్తామని వెల్లడించారు. డ్రోన్ టెక్నాలజీని వ్యవసాయ రంగంలో ప్రవేశపెడతామని తెలిపారు. వ్యవసాయంలో భూసార పరీక్షలు అవసరమన్నారు. భూసార పరీక్షలకు కూడా ఆధునిక టెక్నాలజీ వచ్చిందని.. సేంద్రీయ వ్యవసాయ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయం ప్రకృతి విపత్తులను తట్టుకుంటుందన్నారు. సేంద్రీయ పద్దతిలో పండించిన కూరగాయలకు మంచి డిమాండ్ ఉందని. వ్యవసాయ పనిముట్లను సబ్సిడీలో రైతులకు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.