రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్ ఆదివారం ఉదయం విశాఖ నగరానికి వస్తున్నారు. ఈనెల ఎనిమిదో తేదీన ప్రధాని రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులు, నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించి ప్రధాని సభకు జన సమీకరణపై చర్చిస్తారు. అనంతరం విజయవాడ వెళతారు. తిరిగి ఏడో తేదీ రాత్రి నగరానికి వచ్చి ఎనిమిదో తేదీన ఐటీ సదస్సులో పాల్గొంటారు. అనంతరం ప్రధాని సభకు హాజరవుతారు.