ప్రభుత్వ పాలనలో కీలకమైన ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) తెలుగులో జారీచేయడం మాతృ భాషకు పట్టం కట్టేందుకే అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. దేశంలోనే మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలు తెలుగులో ఉత్తర్వులు ఇవ్వడం అనేది తెలుగుకు సముచిత గౌరవం ఇచ్చినట్లే అని తెలిపారు. తెలుగు మాతృభాష పట్ల సీఎం చంద్రబాబు ఔన్నత్యాన్ని చాటుకున్నారన్నారు. తెలుగు సంస్కృతి ఉనికికి ఈ నిర్ణయం మరో మైలు రాయి అని మంత్రి రాంప్రసాద్ పేర్కొన్నారు.