కర్షకులు, కార్మికులకు అండ ఎర్రజెండా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. కుందుర్పి మండలంలోని బెస్తరపల్లిలో ఆదివారం సీపీఐ శతవార్షికోత్సవాల్లో భాగంగా అమరవీరు ల స్థూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల శిలాఫలకం, సీపీఐ కార్యాల యం, గ్రంథాలయాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, పార్టీ కార్యకర్తలు తప్పెట్లు, ఉరుములు, చెక్కభజనలతో సీపీఐ నాయకులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ దున్నేవాడిదే భూమి అన్న నినాదంతో పోరాడిన గ్రామాల్లో బెస్తరపల్లి ఒకటని కొనియాడారు. ఇలాంటి పోరాటాల ఫలితంగా నియోజకవర్గంలోని దాదాపు 50 వేల ఎకరాలకు పైగా పేద ప్రజలకు పంచామన్నారు.