గత ప్రభుత్వం రైతులను విస్మరించింది అంటూ రాష్ట్ర పౌరసరఫరాలు, ఆహార శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోషల్ మీడియాలో స్పందించారు. వైసీపీ వాళ్లు రైతులకి ధాన్యం డబ్బులు కూడా సక్రమంగా ఇవ్వలేదనే వాస్తవాన్ని గణాంకాలే చెబుతున్నాయని విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వం రైతుల కుటుంబాల్లో సంక్రాంతి తీసుకువచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎప్పుడూ రైతుల మేలు కోసమే ఆలోచిస్తారని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. "జనవరి 5వ తేదీ నాటికి ఖరీఫ్ సీజన్లో 4,15,066 మంది రైతుల నుంచి 27,00,00 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేశాము. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం నాటి ఖరీఫ్ లో 2,12,431 మంది నుంచే ధాన్యం తీసుకొంది. మా ప్రభుత్వం ధాన్యం సేకరణ చేయడమే కాదు 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ చేస్తోంది. రూ.6,083.69 కోట్లు చెల్లింపులు చేశాం" అని నాదెండ్ల వివరించారు.