ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో తెలుగు మీడియం కొనసాగించాలని ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి కోరారు. గురువారం నంద్యాలలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని కొనసాగిస్తూనే సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలన్నారు. గత ప్రభుత్వ దుశ్చర్యలను నివారించి విద్యార్థులకు తెలుగు మాధ్యమంలో చదివే అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శివయ్య, భాస్కర్‌రెడ్డి, జాకీర్‌హుసేన్, వెంకటరామిరెడ్డి, మల్లేశ్వర్, నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఏపీటీఎఫ్ 1938జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మాధవస్వామి, నగిరి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం నంద్యాలలోని డీఈవో కార్యాలయంలో డీఈవో జనార్దన్‌రెడ్డిని ఏపీటీఎఫ్ నాయకులు కలిసి వినతిపత్రం అందించారు.