కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీప్రకాష్ సినర్జీస్ పాఠశాలలో ఈనెల 17వ తేదీ నుంచి 21 వరకూ ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 13వ నేషనల్ స్కూల్స్ జాతీయ స్థాయి చెస్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిం చనున్నట్టు కలెక్టర్ షాన్‌మోహన్ తెలిపారు. దీనిలో భాగంగా ఆయన చెస్ పోటీల నిర్వహ ణకు సంబంధించిన ఏర్పాట్లను జేసీ రాహుల్ మీనాతో కలిసి పరిశీలిం చారు. అనంతరం కలెక్టర్ మాట్లా డుతూ 5 రోజుల పాటు జరగనున్న పోటీల్లో దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలకు చెందిన సుమారు 1239 మంది క్రీడా కారులు పాల్గొంటారని, అలాగే 560 మంది రేటెడ్ క్రీడాకారులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. 12 విభా గాల్లో ఈ పోటీలు జరగనున్నా యని తెలిపారు. క్రీడాకారులకు కల్పించ నున్న భోజన వసతి, సౌకర్యాలు తది తర విషయాలపై స్థానిక అధికారుల తో చర్చించారు. ఎటువంటి ఇబ్బందులు రాకుం డా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్య క్రమంలో ఆర్డీవో కట్రెడ్డి శ్రీరమణి, జిల్లా ప్రాథికార సంస్థ అభివృద్ధి అధికారి శ్రీనివాస కుమార్, శ్రీప్రకాష్ సినర్జీస్ పాఠశాల డైరెక్టర్ సీహెచ్.విజయ్ ప్రకాష్, ఛీఫ్ ఆర్బీటర్ పాల్ ఆరోఖ్యరాజ్, చెస్ అసోసియేషన్ చైర్మన్, కార్య దర్శి కేవీవీ శర్మ, సురేష్, కార్య నిర్వాహణా ధికారి ఫణి, రాజాసూరిబాబురాజు పాల్గొన్నారు.